Tuesday, June 25, 2024

ఆస్పత్రిలో చేరిన మోడీ సోదరుడు!

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ చైన్నైలోని ఆస్పత్రిలో చేరారు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. దామోదర్ దాస్ మల్చంద్ మోడీ, హీరాబెన్‌లకు జన్మించిన ఐదుగురు సంతానంలో ప్రహ్లాద్ మోడీ నాల్గవ వ్యక్తి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయనకు కిరాణ దుకాణం, టైర్ షో రూమ్‌లు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ 27న కర్ణాటక మైసూర్ సమీపంలో ప్రహ్లాద్ మోడీ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబంతో కలిసి బందీపూర్ నుంచి మైసూర్‌కు వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News