Saturday, September 14, 2024

చట్టసభ జాయింట్ సెషన్‌కు మోడీని పిలవాలి

- Advertisement -
- Advertisement -

అమెరికా స్పీకర్‌కు రో ఖన్నా లేఖ

వాషింగ్టన్ : అమెరికాలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అమెరికా చట్టసభల సంయుక్త సమావేశం కూడా ఉంటుందని ఆశిస్తున్నట్లు భారతీయ సంతతికి చెందిన అమెరికా చట్టసభ సభ్యులు రో ఖన్నా తెలిపారు. స్పీకర్ కెవిన్ మెక్‌కార్తి ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు.

జూన్ 22న ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో విందులో పాల్గొంటారు, సంయుక్త సభ ఏర్పాటు చేసి ప్రధాని ప్రసంగానికి ఆహ్వానించాలని స్పీకర్‌కు ఇండియా కాకస్ సహ అధ్యక్షుల హోదాలో రో ఖన్నా ఓ లేఖ రాశారు. ఇతర దేశాల ప్రముఖులు అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు అమెరికా చట్టసభల జాయింట్ సెషన్ ప్రసంగానికి ఆహ్వానించడం అరుదైన ఆనవాయితీగా ఉంది. ప్రధాని మోడీని ఈ సంయుక్త సభకు పిలువడం పూర్తిగా స్పీకర్ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News