Monday, October 14, 2024

కశ్మీర్‌లో థియేటర్ల కళకళ

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : కశ్మీర్‌లో తిరిగి సినిమా సందడి ఆరంభం అయింది. ఉగ్రవాద శక్తుల బెదిరింపులను లెక్కచేయకుండా జనం థియేటర్లకు వస్తున్నారు. స్థానిక ఐనాక్స్ సినిమా హాల్‌లో వెల్‌కమ్ టు కశ్మీర్ సినిమా శుక్రవారం విడుదల కానుంది. కశ్మీరీలు వారి జీవన విధానం గురించి, ఇక్కడి ఆహారపు అలవాటు, పాటలు ఇతివృత్తంగా ఉండే ఈ సినిమాలో ఈ లోయ ప్రాంతం వారే నటులు కావడం విశేషం.

ఈ సినిమాకు తమ థియేటర్ వేదిక కావడం తనకు గర్వకారణం అని థియేటర్ యజమాని వికాస్ ధర్ ఆనందం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు నగరంలో పలు థియేటర్లను కాల్చివేయడం, ప్రేక్షకులను బెదిరించడం వంటి చర్యలకు దిగిన క్రమంలో తన తండ్రి, విద్యావేత్త విజయ్ ధర్ థియేటర్ నిర్మించి , ఇక్కడి వారు సినిమాలు చూడాలనే ఆలోచనకు వచ్చారని , ఇప్పుడు ఆయన కలను తాను నిజం చేశానని వికాస్ ధర్ తెలిపారు. కశ్మీరీలకు సినిమా కల ఉంటుంది. వారికీ సినిమాలను భారీ వెండితెరపై థియేటర్లకు వచ్చి చూడాలనే ఆశ ఉంటుందని, ఇది నెరవేరేలా చేయడంలో తాను సైతం ఓ కీలక పాత్ర పోషించడం, దీనికి తన తండ్రి స్ఫూర్తి కావడం కీలక పరిణామం అని ధర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News