Thursday, April 25, 2024

2025నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి..

- Advertisement -
- Advertisement -

గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవర ప్రాజెక్టును 2025నాటికి పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నామని ఏపి ఈఎన్సీ నారాయణరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి వివరించారు. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తిశాఖ గురువారం ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం నిర్వహించింది. పనుల పురోగతి, సహాయ పునరావాస కార్యక్రమాలు అమలు తదితర అంశాలను సమీక్షించింది. సమావేశం అనంతరం ఈఎన్‌సి నారాయణరెడ్డి మీడియతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆడ్‌హాక్ నిధుల కింద రూ.17,414కోట్లు అడిగిందని తెలిపారు. అందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందన్నారు. 2025నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నామని కేంద్రానికి తెలిపామని, అయితే ఆ లోపే పూర్తి చేయాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూచించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 41.15మీటర్ల ఎత్తు వరకూ ఆర్‌ఆండ్ ఆర్ నిధులు ఇవ్వాలని కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఈఎన్సీ నారాయణరెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News