Sunday, May 5, 2024

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
    ఆమనగల్లు : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు,మాడ్గుల,వెల్దండ, కడ్తాల మండలాలకు చెందిన పలువురు అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను గురువారం నగరంలోని తన నివాస గృహంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.

వెల్దండ పెద్దాపూర్‌కు చెందిన చంద్రారెడ్డికి రూ. 2.50 లక్షల ఎల్‌ఓసి, ఆమనగల్లు కోనాపూర్‌కు చెందిన రామకృష్ణకు రూ. 2.50 లక్షల ఎల్‌ఓసి చెక్కులను, మాడ్గుల సుద్దపల్లి శ్రీనుకు రూ. 60 వేలు, ఆర్కపల్లి నర్సింహ్మకు రూ. 44 వేల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పక్షపాతి అని, దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ప్రజాసంక్షేమానికి పెద్ధపేట వేస్తున్నారని పేర్కొన్నారు. 9 సంవత్సరాల కాలంలో బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు. నిరుపేదలు ప్రభుత్వ పథకాలు ఉన్నాయనే ఎంతో దైర్యంగా తలెత్తుకొని జీవిస్తున్నారని అందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు.

కార్యక్రమంలో మాడ్గుల వైస్ ఎంపిపి శంకర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ రాజవర్ధన్‌రెడ్డి, సర్పంచులు యాదిరెడ్డి, సాయికుమార్, రామస్వామి, ముద్విన్ ఉపసర్పంచ్ వినోద్, నాయకులు మహేష్, నరోత్తమ్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, పరమేష్, శివ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News