Tuesday, September 10, 2024

గంటన్నర వ్యవధిలోనే కిడ్నాపైనా బాలికను పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/గచ్చిబౌలి : రాయదుర్గం పిఎస్ పరిధిలో బాలిక కిడ్నాప్ కేసును గంటన్నార వ్యవధిలోనే పోలిసులు చేధించారు. తల్లిదండ్రులకు బాలికను అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వివరాల ప్రకారం..దర్గా ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న బాలిక (8) పాఠశాల సమయం ముగిసిన ఇంటికి చేరుకోలేదు. వెంటనే బాలిక కుటుంబ సభ్యులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చెసుకొని ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి సిసి కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.

గుర్తు తెలియని వ్యక్తి తనతో పాటు పాపను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న నిందితున్ని బాలికను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన శంకర్ మేడ్చల్ లో ఉంటూ సెంట్రింగ్ పని చేస్తున్నాడు. పాఠశాల బయట ఉన్న బాలికను కిడ్నప్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులకు చిక్కాడు. కిడ్నాప్ కు గురైన బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News