Wednesday, December 6, 2023

పాఠశాల బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పాఠశాలల బస్సులను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ సేఫ్టీ వింగ్, ట్రాఫిక్ పోలీసులతో కలిసి కార్పొరేట్ పాఠశాలల బస్సులను పరిశీలించారు. డ్రైవర్లు, హెల్పర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు, డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవర్లకు కనీసం ఐదు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉందాలేదా అనే విషయాన్ని తనిఖీ చేశారు.

బస్సులకు ఆర్టిఏ అధికారులు తనిఖీ చేసిన ఫిట్‌నెస్ సర్టిఫికేట్లును పరిశీలించారు. బస్సులో పాఠశాల కాంటాక్ట్ నంబర్, విండోలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టీ కిట్, కండక్టర్స్ అంటెండెన్స్, ఐడి కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్థుల లిస్టు ఉందాలేదా, బస్సుపై ఉన్న ట్రాఫిక్ చలాన్లను పరిశీలించారు. డ్రైవర్ల వేలి ముద్రలు తీసుకుని వారికి ఇది వరకు ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News