Wednesday, May 8, 2024

ప్రొఫెసర్ కాసింకు వారం పాటు పోలీస్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

Professor Kasim

 

హైదరాబాద్ ః ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశిం రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలనాత్మక విషయాలను పేర్కొన్నారు. కాశింకు మావోయిస్టు నేతలతో నేరుగా సంబంధాలున్నాయని, మావోయిస్టు రిక్రూట్‌మెంట్లలోనూ,ల్యాండ్ మైన్ పేలుళ్లకు మెటీరియల్ సప్లై చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు సంచలనాత్మక విషయాలతో కూడిన రిపోర్టును గురువారం హైకోర్టుకు సమర్పించనున్నారు. మావోయిస్టులతో కాశింకు సంబంధాలు ఉన్నట్టు ధ్రువీకరించిన పోలీసులు, కాశింతో పాటు ఇప్పటివరకు మొత్తం 60 మందిపై ఊపా చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాశింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, ఇప్పటికీ ఆయన భార్య స్నేహలతతో కలిసి నడుస్తున్న తెలంగాణ అనే సంచికను నడుపుతున్నాని పేర్కొన్నారు.

ఇందుకోసం మావోయిస్టులే నిధులు పంపిస్తున్నారని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. మావోయిస్టులకు కాశిం ఎన్‌క్రిప్టెడ్ విధానంలో ఈ మెయిల్స్ ద్వారా సమాచారాన్ని చేరవేసినట్టు తెలిపారు. కాశింకు సెంట్రల్ బ్యూరో రీజియన్ కార్యదర్శి మల్లోజుల వేణుగోపాల్, కేంద్ర కమిటీ సభ్యులు కట్కం సుదర్శన్, పుల్లూరి ప్రసాదరావు, రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌తో సంబంధాలు ఉన్నట్టు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. అంతేకాదు విచారణలో మావోయిస్టు నేతలతో సంబంధాలున్నట్లు కాశిం ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. మావోయిస్టు రిక్రూట్‌మెంట్లు., తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ విద్యార్థి సంఘం,చైతన్య మహిళా సమాఖ్య వంటి 19 సంఘాలతో మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు కాశిం సమన్వయకర్తగా పనిచేస్తున్నారన్నారు.

మావోయిస్టు నియామకాల్లో కాశిం కీలక పాత్ర పోషిస్తున్నాడని, మావోలకు అవసరమైన కంప్యూటర్లు,ఆయుధాలు సమకూర్చడంలో కాశిం దిట్ట అని రిపోర్ట్‌లో పొందుపరిచారు. తన చర్యలను కప్పి పుచ్చుకునేందుకు కాశిం ప్రొఫెసర్ వృత్తిలో కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాశిం ఇంట్లో 118 డాక్యుమెంట్లు, 163 సిడిలు, 5 డిజిటల్ వీడియో క్యాసెట్లు,44 జిబి సామర్థ్యం గల 4 పెన్ డ్రైవ్స్,8 జిబి మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ల్యాండ్ మైన్ మెటీరియల్ సప్లై పూర్తి ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేశామని వెల్లడించారు.

మొత్తం 60 మంది ఉప్పా చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులతో పాటు,సెంట్రల్ కమిటీ, ప్రజా సంఘాల నేతలు, ప్రజా తెలంగాణ ఫ్రంట్, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ నేతలు, చైతన్య మహిళా సమాఖ్య సభ్యులపై చర్ల పోలీస్ స్టేషన్‌లో 45 మందికి పైగా మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులు కాశింతో పాటు పోలీసు కేసులు నమోదైనవారున్నారన్నారు. ఇటీవల ఎల్‌బినగర్‌లో నమోదైన కేసులో ఎ8గా కాశిం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో కాశిం భార్య స్నేహలతపై ’ఉప్పా’ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు.

పోలీసు కస్టడీకి కాశిం ః ప్రోఫెసర్ కాశింను గజ్వేల్ కోర్టు వారం రోజుల పాటు పోలీసు కస్టడికి అనుమతినిచ్చింది. ఈక్రమంలో సిద్ధిపేట సెషన్స్ కోర్టులో కాశిం బెయిల్ పిటిషన్ దాఖలైంది. కాగా పోలీసులు కాశింను తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.

Police custody for a week for Professor Kasim
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News