Wednesday, April 24, 2024

ఎపి త్రికేంద్రీకరణ సెలెక్ట్ కమిటీకి

- Advertisement -
- Advertisement -

AP Triangulation

 

శాసన మండలి నిర్ణయం
కౌన్సిల్‌లో పాలక, ప్రతిపక్షాల మధ్య తోపులాట, ఉద్రిక్తత
నిరవధిక వాయిదా

హైదరాబాద్ : శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లులకు బ్రేక్ పడింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని సూచిస్తూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లులను ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదింపచేసుకున్న వైసిపి ప్రభు త్వం మండలిలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. చివరకు తన విచక్షణాధికారాల మేరకు బిల్లులను మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి సూచించారు. దీనివల్ల బిల్లుకు కనీసం మూడు నెలల బ్రేక్ పడినట్టేనని నిపుణులు చెబుతున్నారు.

బిల్లులను సెలెక్ట్ కమిటీకి సూచించిన అనంతరం మండలిని చైర్మన్ షరీఫ్ నిరవధికంగా వాయిదా వేశారు. టిడిపికి అధిక సంఖ్యాబలం ఉండటంతో మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యూహ, ప్రతివ్యూహాలతో ఉత్కంఠంగా సాగిన విషయం విదితమే. బిల్లులను ఎలాగైనా ఆమోదించుకోవాలని ప్రభుత్వం గట్టి గా ప్రయత్నిస్తుండగా.. మూడు రాజధానులను ఎలాగైనా అడ్డుకోవాలని టిడిపి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో చైర్మన్ షరీఫ్ నిర్ణయంతో వైసిపికి షాక్ తగలింది. అయితే చైర్మన్ నిర్ణయంపై టిడిపి హర్షం వ్యక్తపర్చింది.

ఆసక్తికర పరిణామాలు
మండలిలో బుధవారం ఉదయం నుంచి ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాసనమండలిలో మూడు రాజధానుల ప్రతిపాదన, సిఆర్డీఎపై చర్చ ముగిసింది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడానికి వీలులేదని గట్టిగా కోరిం ది. బిల్లులను ఆమోదించాలని మంత్రులు కోరా రు. రెండు పార్టీలు పోటాపోటీగా నినదాలు చేశాయి. మంత్రి కొడాలి నాని టిడిపి సభ్యుల వైపునకు దూసుకుపోయేందుకు ప్రయత్నించా రు. దీంతో టిడిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు పార్టీల సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సోడియం వద్ద మంత్రి బోత్స సత్యనారాయణ, లోకేష్‌లు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభను కొద్ది సేపు మండలి చైర్మన్ వాయిదా వేశారు. మండలిలో చోటు చేసుకున్న పరిణామాలను గమనించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు గ్యాలరీలోకి వచ్చారు.

ఏజీని పిలిపించిన ప్రభుత్వం
వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ఆమోదింపజేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డింది. ఇప్పటికే రూల్ నెం.71 శాంపిల్ మాత్రమేనని, బిల్లును మండలిలో అడ్డుకునేందుకు చాలా అస్త్రాలు ఉన్నాయని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్న నేపథ్యంలో ప్రభు త్వం మరింత పట్టుదల ప్రదర్శించింది. వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే విషయంలో ఎటూ తేలకపోవడంతో సలహా సంప్రదింపుల కోసం ప్రభుత్వం అడ్వకేట్ జనరల్‌ను శాసనమండలికి పిలిపించింది.

To the AP Triangulation Select Committee
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News