Thursday, October 10, 2024

లా అండ అర్డర్ పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లా అండ అర్డర్ పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి 547 సబ్ ఇన్సె పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఎస్ఐ పాసింగ్ అవుట్ పరేడ్ లో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పోలీసులపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, పోలీస్ స్కూల్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ గంజాయిపై పోలీసు సిబ్బంది ఉక్కుపాదం మోపుతున్నామన్నారని ప్రశంసించారు. ప్రజల అవసరాలు తీర్చేవిధంగా కాంగ్రెస్ ప్రజాపాలన చేస్తోందని స్పష్టం చేశారు.

గత సర్కార్ హయాంలో టిఎస్ పిఎస్ సిలో లీకేజీలు జరిగాయని, నిరుద్యోగల అసంతృప్తితోనే ప్రజాపాలన వచ్చిందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రేవంత్ వివరించారు. టిఎస్ సిపిఎస్ పై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవని, గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వరసగా ఇస్తున్నామని వివరించారు.  18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, రుణమాఫీతో రైతన్నల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. పేదల పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని, 11 వేల మంది బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News