Monday, April 29, 2024

హంపీలో విదేశీ పర్యాటకులకు పోలీసుల వార్నింగ్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: కర్నాటకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం హంపీలోని తుంగభద్రా నది చివరన ఉండే పవిత్ర పురందర మండపం వద్ద మద్యం సేవిస్తున్న విదేశీ పర్యాటక బృందానికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పురందర మండపం వద్ద మద్యం సేవిస్తూ, ధూమపానం చేస్తూ కంటపడిన ఐదుగురు విదేశీ పర్యాటకులను చూసిన స్థానికులు వారి వద్దకు వెళ్లి ఇక్కడ ఆ పని చేయకూడదని నచ్చచెప్పారు. అయితే వారు వినకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందచేశారు.

పోలీసులు వచ్చే సరికి విదేశీ పర్యాటకులు మందు బాటిళ్లను తమ బ్యాగులలో సర్దుకుని అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సంసిద్ధమవుతుందగా పోలీసులు వారికి క్లాసు పీకి పంపించివేశారు. ఆ ప్రదేశంలో మద్యం సేవించరాదని ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేవని విదేశీ పర్యాటకులు కొద్దిసేపు స్థానికులతో వాదించారు. కాగా..విదేశీ పర్యాటకులపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని హంసి నిర్వాహక సంస్థ అధికారి ఒకరు తెలిపారు.

హంపీలోని ఆలయాల పవిత్రతను విదేశీ పర్యాటకులు కూడా గౌరవిస్తారని, ఆలయాలలో కాని పురాతన కట్టడాల వద్ద కాని ధూమపానం, మద్యపానం చేయరాదన్న విషయం వారికి కూడా తెలుసని ఆయన అన్నారు. విదేశీ పర్యాటకులు కొందరు తెలియక తప్పు చేస్తుంటారని, వారికి నచ్చచెప్పి హెచ్చరించి వదిలివేస్తుంటామని ఆయన వివరించారు. హంపీలో హెచ్చరిక బోర్డుల అవసరం ఇప్పటివరకు రాలేదని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News