Tuesday, April 30, 2024

రెండు రోజుల ముందే పూర్తి చేశాం

- Advertisement -
- Advertisement -

ఇటీవలే యూరప్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగొచ్చిన ‘జాన్’ టీమ్ అక్కడి షూటింగ్ విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనే చిత్ర యూనిట్ ఈ షూటింగ్ కోసం యూరప్ వెళ్లింది. ఎలాగైనా షూటింగ్ పూర్తి చేయాలన్న పట్టుదలతో అతి జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ పూర్తి చేసి వచ్చింది. జాగ్రత్తల నడుమ షూటింగ్ నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని ఈ షెడ్యూల్‌తో తెలిసిందనీ చిత్ర యూనిట్ చెబుతోంది. ఇదిలా ఉండగా మధ్యలోనే ‘జాన్’ షూటింగ్ ఆపేసి తిరిగొచ్చేశారనే గాసిప్ మరోవైపు ఉంది. కానీ అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేసి… పెట్టుకున్న టార్గెట్ కన్నా రెండు రోజుల ముందే చిత్రీకరణ పూర్తి చేసి వచ్చేశామని డైరెక్టర్ రాధాకృష్ణ వివరణ ఇచ్చారు. అలాగే షూటింగ్ సమయంలో మాస్క్‌లు ధరించడం, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, వాడిన వస్తువులను శానిటైజ్ చేయడం, రెగ్యులర్‌గా బాడీ టెంపరేచర్స్ చెక్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు పక్కాగా పాఠించామని ఆయన తెలిపారు. ఇక ఇండియాకి తిరిగొచ్చాక హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డేతో సహా టీమ్ అంతా 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు.

Prabhas ‘Jaan’ movie georgia schedule complete

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News