Saturday, April 27, 2024

నితిన్ నిర్మాణంలో నెక్ట్స్ మూవీ!

- Advertisement -
- Advertisement -

nithin,akhil

అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అంతా సజావుగా సాగితే వచ్చే నెలలో అఖిల్ మూవీ విడుదల అయ్యేది. కానీ కరోనా కల్లోలం కారణంగా సినిమా విడుదల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అఖిల్ తన తదుపరి చిత్రం గురించి చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది. అఖిల్ తన ఐదవ చిత్రాన్ని తన మొదటి సినిమా నిర్మాత నితిన్‌తో చేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ యంగ్ హీరో మొదటి చిత్రం నిరాశపరిచింది. ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదు. అందుకే తన ఐదవ చిత్రాన్ని పారితోషికం తీసుకోకుండా నితిన్ నిర్మాణంలో చేయాలని భావిస్తున్నాడట. సుకుమార్ ఇప్పటికే అఖిల్ కోసం ఒక కథను సిద్దం చేశాడని.. నితిన్‌కు కూడా ఆ స్టోరీ నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలిసింది.

Nithin to Produce Akhil Akkineni 5th movie!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News