Friday, May 2, 2025

కులగణనపై కేంద్రమంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కులగణన విషయంలో రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జనగణనలో కులగణన చేసేందుకు కేంద్రం అంగీకరించిందని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కులగణన విషయంలో మొదట రాహుల్ గాంధీ కు అభినందనలు చెప్పాలని తెలియజేశారు. కులగణన కోరుతూ రాహుల్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని చెప్పారు. తాము కులగణనపై దేశానికి మార్గదర్శకంగా నిలిచామని స్పష్టం చేశారు. దేశంలోని అనేక పార్టీలు కులగణన కోరుతున్నాయని, కులగణన చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాయని అన్నారు. కులగణన నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నామని సిఎం తెలిపారు. కమిటీ కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులను నియమించాలని రేవంత్ కోరారు. తెలంగాణలో బిసిలుగా ఉన్న బోయలు, కర్ణాటకలో మరో వర్గంలో ఉన్నారని, తెలంగాణలో 8 పేజీల్లో 57 ప్రశ్నల ద్వారా తాము వివరాలు సేకరించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News