Wednesday, February 1, 2023

నడిరోడ్డుపై ప్రైవేటు బస్సు దగ్ధం..

- Advertisement -

 

నిర్మల్ న్యూస్:  నిర్మల్‌ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోన్‌ మండలం గంజాల్‌ టోల్‌ ప్లాజా వద్ద ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా బస్సు ఇంజన్‌లో మంటలు చెలరేగి ప్రైవేటు బస్సు దగ్ధమైంది. మంటలను గమనించిన డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 29 మంది ప్రయాణికులతో నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో పూజా ట్రావెల్స్‌కు చెందిన ఎల్‌హెచ్‌ 40 ఎటి 9966 బస్సు పూర్తిగా దగ్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles