Saturday, June 3, 2023

నార్కట్ పల్లిలో లారీని ఢీకొట్టిన బస్సు…

- Advertisement -
- Advertisement -

RTC bus collides with bike: Young woman killed

నార్కట్ పల్లి: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఆ వాహనం బోల్తాపడిన సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి ఫ్లైఓవర్ పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. లారీ రోడ్డుపై అడ్డుగా ఉండడంతో దాదాపుగా మూడు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News