Wednesday, June 19, 2024

రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ నరకయాతన : ప్రియాంక

- Advertisement -
- Advertisement -

బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి వేయడానికి నరకయాతన పడుతోందని, గత పదేళ్లలో పార్లమెంట్, జ్యుడీషియరీ వంటి సంస్థలను నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం ఆరోపించారు. గొడ్డాలో ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎవరైతే వ్యతిరేకిస్తారో వారు బాధితులవుతున్నారని విమర్శించారు. “ వారు (బీజేపీ) మళ్లీ అధికారం లోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. రిజర్వేషన్లలో కోత విధిస్తారు.

గత పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసేశారు. ఇదివరకు పార్లమెంట్‌లో చట్టాల రూపకల్పనకు చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు విపక్షాలపై బీజేపీ నేతల దాడికే సమావేశాలు జరుగుతున్నాయి” అని ప్రియాంక వ్యాఖ్యానించారు. “ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను మోడీ బూటకపు కేసులపై కటకటాల వెనక్కు పంపారు. సోరెన్ భార్య కల్పన ఆడసింహంలా పోరాటం చేస్తోంది. ” అని ప్రియాంక పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం మాదిరి కాకుండా గిరిజన హక్కులను బలోపేతం చేయడమే కాంగ్రెస్ విధానాలని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News