ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చించిన సిఎం
రేవంత్‌రెడ్డి కేంద్ర కులగణన నిర్ణయం
కాంగ్రెస్ ఘన విజయంగా చాటి చెప్పేలా
సభ రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి
చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డి రెండో రోజూ (శనివారం) ఢిల్లీలో పర్యటించారు. శుక్రవారం సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న ఆయన శనివారం పార్టీ అగ్రనేతలతో ఆయన భేటీ అయినట్టుగా తెలిసింది. తెలంగాణ లో కులగణనపై భారీ బహిరంగ సభ నిర్వహించే యోచన పై వారితో సిఎం రేవంత్ చర్చించినట్టుగా సమాచారం. కేం ద్ర ప్రభుత్వం రాబోయే జనగణనలో కులగ ణన నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నేతలు క్యాస్ట్‌సెన్సస్ అంశంపై చర్చించారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తెలంగాణలో తాము అనుసరించిన విధానం, డిమాండ్ వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణనకు సిద్ధమయ్యిందన్న సందేశాన్ని దేశానికి పంపేలా ఈ సభ ప్లాన్ చేస్తున్నట్లు గా తెలుస్తోంది. ఈ సభ ఎక్కడ ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై శనివారం ప్రధానంగా పార్టీ పెద్దలతో సిఎం చర్చించిన ట్టుగా తెలిసింది. వీటితో పాటు ఆపరేషన్ కగార్ ఆపాలని ఇటీవల శాంతి చర్చల కమిటీ సిఎంను కలిసింది. ఈ అంశాన్ని కూ డా పార్టీ పెద్దల దృష్టికి సిఎం తీసుకెళ్లినట్టుగా సమాచారం. అనంతరం శనివారం రాత్రి సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.