Sunday, June 4, 2023

సిఎం కెసిఆర్‌ను కలిసిన పులిమామిడి నారాయణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కనీస వేతనాల సలహా బోర్డు నూతన ఛైర్మన్ పులిమామిడి నారాయణ గురువారం ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదములు తెలిపారు. కనీస వేతనాల సలహా బోర్దును నియమిస్తూ కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ సెక్రెటరియేట్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి తనకు కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ సందర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతు కష్టపడి పని చేసే వారికి బిఆర్‌ఎస్ పార్టీలో పదవులు తప్పకుండా వస్తాయనే దానికి పులిమామిడి నారాయణ నియామకమే ఉదాహరణ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News