Sunday, December 15, 2024

రిలీజ్ ముందే.. పుష్ప రాజ్ రికార్డుల వేట..

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2 విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. ‘పుష్ప2’ చూసేందుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుష్పరాజ్ రికార్డుల వేట మొదలుపెట్టాడు. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో పుష్పరాజ్‌ హవా చూపిస్తున్నాడు. అత్యంత వేగంగా వన్‌ మిలియన్ డాలర్‌ల మార్క్‌ను అందుకున్న చిత్రంగా పుష్ప 2 రికార్డు సృష్టించింది.

మరోవైపు ఈ సినిమా ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. నవంబర్ 17న విడుదలైన ఈ మూవీ ట్రైలర్ 36 గంటల్లోనే 120 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ బిజినెస్ కూడా రూ.1000 వెయ్యి కోట్లు దాటినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనాలను ఈ మూవీ సృష్టిస్తుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News