Friday, September 13, 2024

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

- Advertisement -
- Advertisement -

టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ హెడ్ కోచ్‌గా ఎంపికైనట్టు తెలిసింది. భారత జట్టు కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో అతని సేవలను ఉపయోగించు కోవాలని రాజస్థాన్ ఫ్రాంచైజీ యాజమాన్యం భావించింది.

ఈ మేరకు ద్రవిడ్‌ను కోచ్ పదవి కోసం ఒప్పించినట్టు తెలిసింది. రానున్న సీజన్‌లో ద్రవిడ్ రాజస్థాన్ టీమ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. కానీ ద్రవిడ్‌కు ఉన్న అపార అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అతన్ని హెడ్ కోచ్‌గా నియమించేందుకు రాజస్థాన్ టీమ్ యాజమాన్యం ఆసక్తి కనబరుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News