Tuesday, October 15, 2024

యుఎస్‌లో సిక్కుల వ్యాఖ్యపై మౌనం వీడిన రాహుల్

- Advertisement -
- Advertisement -

యుఎస్‌లో తన ఇటీవల పర్యటనలో సిక్కులపై తాను చేసిన వ్యాఖ్యలపై భారీ ఎత్తున వస్తున్న విమర్శలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు మౌనం వీడారు. బిజెపి అసత్యాలు వ్యాప్తి చేస్తోందని రాహుల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. ‘బిజెపి ఎప్పటి వలె అసత్యాలకు పూనుకుంటున్నది. వారు నిజాన్ని భరించలేరు కనుక నా నోరు మూసివేయించాలని తహతహలాడుతున్నారు.

అయితే, భారత్‌ను నిర్వచించే విలువలు మన భిన్నత్వంలో ఏకత్వం, సమానత్వం, ప్రేమ కోసం నేను సదా మాట్లాడుతాను’ అని రాహుల్ ట్వీట్ చేశారు. సిక్కు సమాజం గురించి తాను అన్నదానిలో ఏమైనా తప్పు ఉందా అని ఆయన అడిగారు. ‘నేను అన్నదానిలో ఏమైనా తప్పు ఉన్నదా అని భారత్‌లోని, విదేశాల్లోని ప్రతి ఒక్క సిక్కు సోదరుని, సోదరీమణిని అడగదలిచాను. ప్రతి సిక్కు, ప్రతి భారతీయుడు ఏమాత్రం భయం లేకుండా తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించగలిగే దేశంగా భారత్ ఉండరాదా?’ అని రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News