Saturday, May 11, 2024

నెహ్రూజీ పేరు చెరిపివేస్తే చెదరిపోదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నెహ్రూజీ తన పనితో, తన కృషితో పేరు తెచ్చుకున్నారు కానీ తన ఇంటిపేరుతో పేరు తెచ్చుకోలేదని కాంగ్రెస్ నేత , ఎంపి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశ రాజధానిలోని నెహ్రూ మ్యూజియం పేరు మార్పిడి వివాదంపై రాహుల్ స్పందించారు. తీన్‌మార్గ్‌లోని పురాతన నెహ్రూ మొమొరియల్ మ్యూజియం, అండ్ లైబ్రరీ ఇప్పటివరకూ నెహ్రూ జ్ఞాపక చిహ్నంగా నిలిచింది. అయితే ఇప్పుడు దీని పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మోడీ ప్రభుత్వం పేరు మార్చింది. ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. దేశ స్వాతంత్య్ర దినోత్సం నేపథ్యంలో ఈ కీలక మార్పిడి జరిగింది. ఈ మ్యూజియం నెహ్రూజీ కీ పెహచాన్ , ఆయన పేరిట అందరికి సుపరిచితంగా ఉందని నెహ్రూ మునిమనవడు రాహుల్ తెలిపారు. ఈ మ్యూజియం ఆయన పేరిట ఉంది, ఇక నెహ్రూజీకి గుర్తింపు దక్కింది కేవలం ఆయన నిర్వర్తించిన కర్మం (పని)ని బట్టి ఆయన పేరుకు గుర్తింపు వచ్చిందని రాహుల్ తెలిపారు.

రెండు రోజుల లేహ్ పర్యటనకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన దశలో తనను పలకరించిన విలేకరులతో రాహుల్ మాట్లాడారు. ఎంతసేపూ నెహ్రూ వారసత్వాన్ని కించపర్చడం లేకుండా చేయడం తప్ప ప్రధాని నరేంద్ర మోడీకి మరో అజెండా లేదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రస్థాయి నిరసనలు వెలువడ్డాయి. ఎన్‌ఎంఎంఎల్ పేరును ఇప్పుడు పిఎంఎంఎల్‌గా మార్చడం కేవలం బిజెపి సంకుచిత ధోరణికి పరాకాష్ట అయిందని పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ప్రధాని మోడీ ఈ మ్యూజియంలోని తొలి పదం ఎన్‌ను తీసివేసి పి తగిలించారు. ఈ పి నిజానికి సంకుచితం, విద్వేషానికి సంబంధించిన విషయం అని కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. నిజానికి ఈ పేరు మార్పు నిర్ణయం జూన్ మధ్యలోనే తీసుకున్నారు. ఇప్పుడు దీనిని అధికారికంగా ప్రకటించారు. పిఎంఎంఎల్ సొసైటీ కార్యవర్గ మండలి ఉపాధ్యక్షులు ఎ సూర్య ప్రకాశ్ పేరు మార్పిడి ప్రకటన వెలువరించారు.

సమాజ ప్రజాస్వామీకరణ, బహుళత్వ సాధన దిశలో సాగే ప్రక్రియలో ఇదో భాగం అని ఈ దశలో స్పందించారు. పేరు మార్పిడిపై కాంగ్రెస్ విమర్శలు కేవలం ఏడుపుగొట్టుతనంతో ఉన్నాయని బిజెపి నేతలు, కొందరు కేంద్ర మంత్రులు ఎదురుదాడికి దిగారు. ఇతర ప్రధానుల పేర్లకు స్థానం కల్పించేందుకు భారత తొలి ప్రధాని పేరును తీసివేయడం చాలా తేలిక పని అని , అయితే ఈ విధంగా చేయడం వల్ల దీని వెనుక ఉన్న కిటుకు తెలుస్తుందని కాంగ్రెస్ ఎంపి శశి స్పందించారు. ఇప్పటికీ ఈ మ్యూజియం పేరును నెహ్రూ మెమోరియల్ ప్రైమ్‌మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీగా పిలుచుకోవచ్చునని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News