Monday, September 25, 2023

మోడీ ‘ఘనకార్యాల’తో రోడ్డునపడ్డ 45 కోట్ల మంది నిరుద్యోగులు

- Advertisement -
- Advertisement -

Rahul gandhi fires on Modi over Unemployment issue

రాహుల్ గాంధీ ఆరోపణ

న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఘనకార్యాల కారణంగా దేశంలో 45 కోట్ల మందికి నిరుద్యోగులు ఉద్యోగం దొరుకుతుందన్న ఆశలు వదులుకున్నారని రాహుల్ మండిపడ్డారు. గడచిన 75 ఏళ్లలో ఈ రకంగా వ్యవహరించిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరేనని ఆయన ఎద్దేవా చేశారు. నవ భారతదేశం కొత్త నినాదం–ప్రతి ఇంట్లో నిరుద్యోగం అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. గడచిన ఐదేళ్లలో 2.1 కోట్ల ఉద్యోగాలు పోయాయని, 45 కోట్ల మంది ఉద్యోగాల కోసం వెదుకులాట ఆపేశారంటూ వెలువడిన ఒక వార్తా కథనాన్ని కూడా రాహుల్ తన ట్వీట్‌తో జతచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News