Sunday, December 3, 2023

ఛత్తీస్‌గఢ్ ర్యాలీలో రాహుల్ మాటల్లో పొరపాటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్ ర్యాలీలో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు పొరపాటు దొర్లింది. ఛత్తీస్‌గఢ్ కబీర్‌ధామ్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీపై ధ్వజమెత్తారు. బిజేపి ధనిక వర్గానికే సేవ చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా పనిచేస్తోందని విమర్శించారు. ఈ సందర్బంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కూడా అదానీ వంటివారికి అనుకూలంగా పనిచేస్తున్నారని పొరపాటుగా మాట్లాడారు.

ఆ తరువాత తన పొరపాటును సరిదిద్దుకున్నారు. ఏదెలాగైనా తాము రైతులు, కార్మికులు, చిన్నతరహా వ్యాపారులకు మద్దతుగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా పాల్గొన్నారు. రాహుల్ పొరపాటుకు ఆయన విస్తుపోయారు. రాహుల్ మాటల పొరపాటును బీజేపీ అవకాశంగా తీసుకుని అవహేళన చేసింది. అదానీకి అనుకూలంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఒప్పుకున్నారని బీజేపీ ఐటి విభాగం అధినేత అమిత్ మాలవీయ ఎగతాళి చేశారు.రాహుల్ టార్గెట్ చేయడంలో అలసిపోడని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News