Sunday, May 5, 2024

మౌర్యుల అసెంబ్లీ హాలు కూరుకుపోవడంపై ఆందోళన

- Advertisement -
- Advertisement -

పాట్నా : మౌర్యుల కాలం నాటి 80 స్తంభాల అసెంబ్లీ హాలు మట్టిలో కూరుకుపోవడంపై పురావస్తుశాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాట్నా లోని కుమ్‌హరర్ ఏరియాలో 2000 ఏళ్ల నాటి మౌర్యుల అసెంబ్లీహాలు భవనం ఉంది. అశోక చక్రవర్తి ఈ భవనంలో సమావేశాలు నిర్వహించేవారని ప్రతీతి. 191213 మధ్యకాలంలో మొట్టమొదట ఇది వెలుగు లోకి వచ్చింది. అయితే ఇక్కడ తరచుగా నీరు నిలిచిపోవడం, నీరు చిమ్మడం వంటి కారణాల వల్ల 2004లో పురావస్తుశాస్త్ర విభాగం వారు దీన్ని కప్పివేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కొత్తగా పురావస్తుశాఖ నుంచి వారసత్వ కట్టడాల నిబంధనలు వెలువడడంతో ఈ అసెంబ్లీ హాలు ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రదేశంలో తిరిగి తవ్వకాలు చేపట్టి అసెంబ్లీహాలును పరిరక్షించాలని బీహార్ హెరిటేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిజోయ్ కుమార్ చౌదరీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News