Thursday, May 2, 2024

రాసి పెట్టుకోండి… రాహులే ప్రధాని

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాసిపెట్టుకోండి…. జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని సిఎం రేవంత్ రె డ్డి అ న్నారు. రెండోరోజూ ఎన్నికల ప్రచారంలో పా ల్గొన్న తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి కేరళలోని వ యనాడ్‌లో రైతుల సమావేశంలో మాట్లాడుతూ కే రళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగిన వారు తెలివైన వారన్నారు. కేరళ ప్రజల శ్రమ వల్ల దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయని, కానీ, కేరళ అభివృద్ధి కాలేదన్నారు. కేరళ సిఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ స భ్యులు అవినీతిలో మునిగిపోయారన్నారు. బంగారం స్మగ్లింగ్‌లో సిఎం విజయన్
కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. సిఎం విజయన్‌పై ఈడీ, ఆదాయపన్ను కేసులున్నా ఆయన పై మోడీ చర్యలు తీసుకోవడం లేదన్నారు.

ప్రధాని మోడీతో కేరళ సిఎం విజయన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాల ప్రయోజనాలు, నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయాలన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కేంద్రంతో నిధుల కోసం పోరాడుతున్నాయన్నారు. కేరళ సిఎం విజయన్ మాత్రం కేంద్రంతో ఎలాంటి పోరాటం చే యడం లేదన్నారు. పైకి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న విజయన్, కమ్యూనిస్టు కాదని, కమ్యూనలిస్టు అని ఆయన అన్నారు. మతతత్వ బిజెపితో కలిసి విజయన్ పని చేస్తున్నారని ఆయన తెలిపారు. వాయనాడ్‌లో బిజెపి అభ్యర్థి సురేంద్రన్‌కు కేరళ ముఖ్యమంత్రి విజయన్ మద్దతు ఇస్తున్నారని ఆయన తెలిపారు. సొంత పార్టీ సిపిఎంతో పాటు కేరళ ప్రజలను పినరయి విజయన్ మోసం చేస్తున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు.

దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం
ఈడీ, ఆదాయం పన్ను కేసులున్నన్ని రోజులు పార్టీ కోసం విజయన్ పనిచేయరన్నారు. మణిపూర్‌లో వందలాది మంది క్రిస్టియన్లు బిజెపి గుండాల చేతిలో చనిపోయారన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా మణిపూర్‌లో పర్యటించలేదని, కానీ, రాహుల్ గాంధీ అక్కడి బాధితులను కలిశారన్నారు. దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోందన్నారు. మోడీ పరివార్‌లో ఈడీ, ఈవీఎంలు, సిబిఐ, ఇన్‌కంట్యాక్స్, అదానీ, అంబానీ ఉన్నారని సిఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పరివార్‌లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ , వాయనాడ్ కుటుంబ సభ్యులున్నారని ఆయన తెలిపారు.

వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య పోరు
ఇందిరా, రాజీవ్‌లు దేశం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. సోనియా, రాహుల్ గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారన్నారు. వాయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఉన్నారని, తాను ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ పై వాయనాడ్ ప్రజల అభిమానాన్ని చూద్దామనే నేను తెలంగాణ నుంచి వచ్చానని ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని మేం రాహుల్ గాంధీని కోరామన్నారు. కానీ, వాయనాడ్ వైపే ఆయన మొగ్గు చూపారన్నారు. గత ఎన్నికల్లో వాయనాడ్‌లో 65 శాతం ఓట్లు వచ్చాయని, ఈ సారి 75 శాతం ఓట్లు రావాలన్నారు. మోడీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నామన్నారు. వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందన్నారు. వయనాడ్ ప్రజలు ఓటు వేయబోయేది కేవలం ఎంపి అభ్యర్థికి మాత్రమే కాదని, దేశానికి కాబోయే ప్రధానికి అని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News