Friday, April 26, 2024

ప్రజాస్వామ్యం పతనం కానివ్వబోం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజోపకారి, ఇది పతనం చెందితే ప్రపంచానికి, అమెరికా జాతీ య ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం నేషనల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఘనత వహించిన భారతీయ ప్రజాస్వామ్యం పల్చనకావడం ప్రపంచానికి మంచిదవుతుందా? అని విలేకరులను ప్రశ్నించారు. అ యితే ఇదే సమయంలో ఆయన పలుదఫాలుగా ప్రజాస్వామ్య అంశం పూర్తిగా తమ భారతదేశ అంతర్గత విష యం అవుతుందని తేల్చిచెప్పారు. ‘దేశంలో ప్రజాస్వా మ్య పరిరక్షణకు పాటుపడుతూనే ఉంటాం.

ఇది మా బాధ్యత, మా వ్యాపకం, ప్రజాస్వామ్యం కోసం పోరాడ టం మా మా పనిలో ఓ భాగం’ అని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకుండా చూడ టం జరుగుతుందని అన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్య ఉనికి, పటిష్టత నిర్థిష్టంగా అమెరికాపై ఎప్పుడూ ప్రభా వం చూపుతూనే ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యం విషయంపై తమకు అవగావహన ఉందని తెలిపిన రాహుల్ పరిస్థితిని తాము అంగీకరిస్తామని, కార్యాచరణకు దిగుతామని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్యం పట్ల ఇక్కడివారికి ఎంత విలువ ఉందనేది దీని గురించి ఆలోచించే స్థాయిని బట్టి వెల్లడవుతుందని రాహుల్ చెప్పారు. ప్రజాస్వామ్యం కోసం పోరు కు కట్టుబడి ఉన్నామని, దీనిని ఎంత స్థాయిలో అయినా ముందుకు సాగుతామన్నారు.
అమెరికాతో బంధం అపరిమితం కావాల్సిందే
భారత్ అమెరికా మధ్య సంబంధాలు కేవలం రక్షణ విషయాల వరకే పరిమితం అయి ఉండరాదని, వీటిని మరింతగా వివిధ కోణాలలో విస్తృతపర్చుకోవల్సి ఉందని రాహుల్ తెలిపారు. భారతదేశం తన ప్రయోజనాల దిశలో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ అంశమే దిక్సూచి అవుతుంది. అయితే ఇప్పుడు నిరంకుశ విధానం ఎందుకు పాటిస్తున్నారో తెలియడం లేదన్నారు. ఏ విషయంలో అయినా ప్రజాస్వామిక ప్రక్రియ అవసరం అన్నారు. ఇందులో భారతదేశ పాత్ర కీలకం. పలు విషయాలపై భారత్‌కు సొంత అభిప్రాయాలు ఉంటా యి. వీటిని నిర్థిష్టంగా రూపొందించుకోవల్సి ఉంటుంది. కేవలం వీటిని ఎవరో ఒక్కరు తమ కేంద్రీకృత విషయంగా భావించుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

ఇది ఏకపక్షం మొండిపట్టు అవుతుందని ప్రధాని మోడీ వైఖరిపై ఆయన పరోక్షంగా పలు విమర్శలను గుప్పించారు. ఈ నెల చివరి వారంలో అమెరికాలో ప్రధాని మోడీ పర్యటించనున్న దశలోనే రాహుల్ దాడి తీవ్రతరం అయింది. ఎవరికి అయినా ఏ విషయంపై అయినా అహంకార ధోరణి అనుచితం అవుతుందన్నా రు. భారతదేశానికి అనేక బలాలున్నాయని, ప్రజాస్వామిక విలువలు , డేటా వీటితో పాటు సాంకేతికత, ఉన్నత విద్యాపటిమ, సాంకేతిక విద్యాధిక జనాభా వంటివి దేశానికి ఉన్న బలాలని తెలిపారు.
చైనాది ప్రజాస్వామ్యేతర ఉత్పత్తి, ఉన్నతి విజన్
భారత్ అమెరికా మధ్య పూర్తి స్థాయి సమన్వయం ఉంది. ఈ దిశలో రెండు మరింత కలిసికట్టుగా వ్యవహరిస్తే శక్తి అవుతుంది. అయితే ప్రపంచంలో ఇప్పుడు చైనా ప్రధాన కేంద్రంగా విస్తరిస్తోన్న ఓ విజన్‌ను ఎదుర్కొంటున్నామని , ఇది చైనీయ విజన్ అని , ప్రపంచస్థాయిలో ఇది ఉత్పాదకత, వికాసానికి దారితీస్తోంది. అయితే ఇది పూర్తిగా అప్రజాస్వామిక పరిధిలో ఉంటోందని రాహుల్ తెలిపారు. ఒకవేళ దీనికి కౌంటర్‌గా భారత్ అమెరికాల పూర్తి స్థాయి ప్రజాస్వామిక మిశ్రిత విజన్ సమకూరితే ప్రపంచ స్థాయిలో మార్పు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చైనా విజన్ కాకుండా ప్రపంచానికి సరికొత్త ప్రత్యామ్నాయ విజన్ అవసరం. ఇప్పుడు చలామణిలో ఉన్న చైనా విజన్ నిజానికి అమెరికాకు, ఇండియాకు, ఇతర ప్రజాస్వామిక శక్తులకు సవాలు విసురుతోందన్నారు. చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమిస్తోందని, తనకు తెలిసిన సమాచారం మేరకు ఇప్పటికే చైనా 1500 చదరపు కిలోమీటర్లు అంటే దాదాపు ఢిల్లీ సైజులో ఉండే భూభాగాన్ని కబ్జా చేసేసిందని అన్నారు. పత్రికా స్వేచ్ఛ దెబ్బతింటోందనేది నిజమేనని రాహుల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News