Thursday, March 28, 2024

పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే కాలెయాదయ్య

చేవెళ్ల రూరల్: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ది సాధించిందని స్థానిక ఎమ్మెల్యే కాలెయాదయ్య తెలిపారు. దశాబ్ది తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి అమరవీరులను స్మరించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందిందని, దేశంలో ఎక్కడ లేని విధంగా పథకాలు, అభివృద్ది చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలు మరువలేనివన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను గౌరవిస్తుందని తెలిపారు. అదేవిధంగా మిషన్ భగీరథ కార్యాలయం, పంచాయతీరాజ్ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఎగరవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ నర్సింలు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్గాని నరేందర్‌గౌడ్, బీఆర్‌ఎస్వీ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు రాఘవేందర్‌రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News