Saturday, September 21, 2024

కేసముద్రంలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో పలు గ్రామాలు నీటిలో చిక్కుకుపోయాయి.. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. మరోవైపు, భారీ వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గర వరద ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు రైళ్లను రైల్వే అధికారులు నిలిపేశారు.

దాంతోపాటు, జిల్లాలోని నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాగు వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని.. తమను కాపాడాలంటూ బంధువులను, అధికారులను ప్రయాణికులు వేడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News