Friday, March 29, 2024

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rain in many parts of Hyderabad

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్ పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, మీర్ పేటలో వాన పడుతోంది. పలుప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతోపాటు నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News