Sunday, October 6, 2024

21వరకూ తెలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 21వరకూ తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కింది స్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశనుంచి తెలంగాణ రాష్ట్రంవైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్కడక్కడా రాగల రెండు రోజల్లో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదివారం రాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 12.4మి.మి వర్షం కురిసింది. వేమన్‌పల్లిలో 5.9, కొమరంభీం జిల్లా తిర్యానిలో 5మి.మి వర్షం కురిసింది.కడ్డం పెద్దేరులో 3.9, తాండూరులో 3.6, దహేగాన్‌లో 1.9, లింగాలహత్నూర్‌లో 1.7, జైపూర్‌లో 1.6, రుద్రాంగిలో 1.4, కన్నాయ్‌గూడెంలో 1.3 మి.మిచొప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News