Tuesday, October 15, 2024

కెటిఆర్ వర్సెస్ శ్రీధర్‌బాబు

- Advertisement -
- Advertisement -

అతి తెలివి మంత్రి.. సిగ్గులేకుండా
ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు?..
మంత్రి శ్రీధర్ బాబుపై కెటిఆర్ ఆగ్రహం

ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో
ప్రత్యక్షంగా కనబడుతుంది
కెటిఆర్‌కు శ్రీధర్‌బాబు కౌంటర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇద్దరు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్కు ఏం సంబంధమన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేకుండా నీతిమాలిన రాజయం ఎందుకు చేస్తున్నారనంటూ ప్రశ్నించారు.అతి తెలివి మంత్రి గారూ… మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా..? అంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. అసలు చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలు ఎందుకని ప్రశ్నించారు. మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్లను మా వాళ్లని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోందని మంత్రి శ్రీధర్‌బాబును ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మీ అతితెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు.. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారు : మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్

ఇద్దరు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు గొడవ పడితే కాంగ్రెస్‌కు ఏం సంబంధమన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కెటిఆర్ చేసిన విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. అతి తెలివి మంత్రి గారంటూ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని…బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ తాను బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎను అని వ్యాఖ్యానించిన సంగతి గుర్తు చేశారు. మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్టు మేము తలదూర్చమని కెటిఆర్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ముందు మీరు మీ పార్టీ అంతర్గత కుమ్ములాటలు చక్కదిద్దుకోండని కెటిఆర్‌కు సూచించారు. బిఆర్‌ఎస్ పార్టీ అంతర్గత వివాదాన్ని తమ పార్టీపై వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలేనని, ప్రాంతాలకు అతీతంగా వారందరినీ గౌరవిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని కాపాడుతామని శ్రీధర్‌బాబు అన్నారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని మరింత పెంచడానికి అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News