Sunday, October 6, 2024

చైనా సాయంతో మమత ద్వారా భారత్ ముక్కలు

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాడికల్ తీవ్ర వ్యాఖ్యలు
ఢాకా : బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాడికల్ నేత జషిముద్దిన్ రహ్మనీ హఫీ భారతదేశంపై వివాదాస్పద , రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదిగా పేరు పడ్డ రహ్మనీ బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వ పతనం తరువాత జైలు నుంచి విడుదల అయ్యారు. ఇప్పుడు ఓ ఆసుపత్రి ఆవరణ నుంచి ఆయన వెలువరించిన సందేశం వీడియో వెలుగులోకి వచ్చింది. భారతదేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ను మోడీ పాలన నుంచి విముక్తి చేయాలి. స్వాతంత్య్రం ప్రకటించుకోవాలి. ఇక ఈశాన్య భారత్‌ను విడగొట్టి ఢిల్లీపై ఇస్లామిక్ జెండా ఎగురేస్తామని, ఇందుకు చైనా మద్దతు తీసుకుంటామని కూడా ప్రకటించారు.

బంగ్లాదేశ్‌పై మోడీ సర్కారు ఎటువంటి చర్యకు దిగినా దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించాడు. రహ్మనీ బంగ్లాదేశ్‌లోని అన్సరుల్లాబంగ్లా టీం (ఎబిటి) అధినేతగా ఉన్నారు. ఇది ప్రపంచస్థాయి అల్‌ఖైదాకు అనుబంధంగా ఉంది. ఈ నెల మొదటివారంలో ఆయన ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో దేశంలో విప్లవానికి నెలరోజులు అని వ్యాఖ్యానించారు. హసీనా పదవీచ్యుతిపై స్పందించారు. పిట్ట కొంచెం కూత ఘనం రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పరిశీలకులు స్పందించారు. ఆయన వ్యాఖ్యలను నిజనిర్థారణ బృందం ప్రాతిపదికన ఇండియా టుడే డిజిటల్ వెలుగులోకి తీసుకువచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News