Sunday, October 6, 2024

‘రిజర్వేషన్లకు స్వస్తి’ అన్న రాహుల్ వ్యాఖ్యలకు ధన్‌ఖడ్ ఆక్షేపణ

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ వ్యతిరేక దృక్పథాన్ని అది సూచిస్తోంది
రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అట్టి వ్యాఖ్యలు చేయతగదు

ముంబయి : ‘రిజర్వేషన్లను అంతంచేస్తాం’ అని వ్యాఖ్యానించినందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ఆదివారం పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయడం ‘రాజ్యాంగ వ్యతిరేక దృక్ఫథాన్ని’ సూచిస్తున్నదని ధన్‌ఖడ్ అన్నారు. ధన్‌ఖడ్ ముంబయిలో ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ, భారత రాజ్యాంగం గురించిన అవగాహన అత్యంత ఆవశ్యకమని, ఎందుకంటే కొందరు రాజ్యాంగం ఆత్మను విస్మరించారని అన్నారు. ‘రిజర్వేషన్ విధానం అంతం కావాలని రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి విదేశీ భూభాగంపై నుంచి వ్యాఖ్యానించడం అదే రాజ్యాంగ వ్యతిరేక మనస్తత్వాన్ని చూపుతున్నది. రిజర్వేషన్‌కు వ్యతిరేక వైఖరిని బదలాయించారు. అదే పాత రాజ్యాంగ వ్యతిరేక దృక్పథం’ అని ధన్‌ఖడ్ లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుని పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. ‘రిజర్వేషన్ ప్రతిభస్వామ్యానికి వ్యతిరేకం కాదు. కానీ అది దేశానికి, రాజ్యాంగానికి ఆత్మ. అది సకారాత్మకమైనదే కానీ ప్రతికూలమైనది కాదు. అది ఒకరి అవకాశాన్ని పరిహరించడంకాదు, కానీ సమాజం బలానికి పునాదులైనవారికి దత్తం చేయడం’ అని ధన్‌ఖడ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News