- Advertisement -
మన తెలంగాణ/మోత్కూర్: రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వానాకాలం పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని మండల వ్యవసాయ అధికారిణి వి.కీర్తి, వ్యవసాయ విస్తరణ అదికారి తుంగ గోపీనాథ్ లు తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ… మోత్కూర్ మండలంలోని అనాజిపురం, పాటిమట్ల, దత్తప్పగూడెం రైతు వేదికల్లో మంగళవారం ఉదయం 10:00 గంటల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు వానాకాలం పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్యం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వివరిస్తారని తెలిపారు. రైతులు పాల్గొని శాస్త్రవేత్తల విలువైన సలహాలు సూచనలు వినాలని కోరారు.
- Advertisement -