Friday, September 19, 2025

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమై కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాజస్థాన్ ఎన్నికల కోసం 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రాజస్థాన్ లో మొత్తం 200 స్థానాలకు గానూ 199 స్థానాలకు పోలింగ్ జరగనుంది. కరణ్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి గుర్మిత్ సింగ్ కున్నూర్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఈ ఎన్నికల బరిలో 1862 మంది అభ్యర్థలు ఉన్నారు. డిసెంబర్ 3న రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News