Saturday, September 14, 2024

పెళ్లికి సిద్ధమవుతున్న అందాల తార

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ మరో 21రోజుల్లో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక తాజా కబురు ఏంటంటే ఆమె పెళ్ళికి సంబంధించిన పనులు ఊపందుకోనున్నాయి. ఆమె కుటుంబ సభ్యులు త్వరలో గోవాకి షిఫ్ట్ కానున్నారని తెలిసింది. గోవాలోని ఒక రిసార్ట్ లో రకుల్ పెళ్లి జరుగనుంది.

ఫిబ్రవరి 22న ఆమె పెళ్లి ముహూర్తం. పెళ్ళికి రెండు వారాల ముందే కుటుంబం మొత్తం గోవాకి వెళ్ళిపోతుందట. రకుల్ నటిస్తున్న కొన్ని చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నా అవి విడుదల కావడానికి చాలా సమయం ఉంది. కాబట్టి ఆమె పెళ్లి సంబరాలను ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. 33 ఏళ్ల రకుల్ 39 ఏళ్ల జాకీ భగ్నానీని పెళ్లాడనుంది. చాలా కాలంగా వీరు డేటింగ్‌లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News