Wednesday, May 1, 2024

‘ది గోట్ లైఫ్‘ బిగినింగ్ లుక్

- Advertisement -
- Advertisement -

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా ‘ది గోట్ లైఫ్‘ (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ‘ది గోట్ లైఫ్‘ (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

ఏప్రిల్ 10న ‘ది గోట్ లైఫ్‘ (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విదుదల కానుంది. బుధవారం ఈ సినిమా నుంచి ది బిగినింగ్ పోస్టర్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి మూవీ టీమ్‌కు తన బెస్ట్ విషెస్ అందించారు. గత రెండు పోస్టర్స్ చూస్తే ఈ బిగినింగ్ పోస్టర్ భిన్నంగా ఉంది. ఇందులో తన సుదీర్ఘ ప్రయాణానికి ముందు సంతోషంగా ఉన్న నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News