Tuesday, December 10, 2024

ఇది అన్యాయం.. ఒక పోస్టుపై ఇన్ని కేసులా?: రామ్‌గోపాల్‌ వర్మ

- Advertisement -
- Advertisement -

వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులపై వర్మ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని, ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారించనుంది.

కాగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లపై అసభ్యకర పోస్టు పెట్టడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్మపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా.. వర్మ స్పందించలేదు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినా అందుబాటులోకి రాలేదు వర్మ. దీంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆర్జీవి హైకోర్టును ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News