Wednesday, October 9, 2024

ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా రామ్ నగర్ బన్నీ

- Advertisement -
- Advertisement -

చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామ్ నగర్ బన్నీ‘. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన ‘రామ్ నగర్ బన్నీ’ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ “ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు.

ఆయనకు నా కథ నచ్చడంతో వాళ్ల అబ్బాయి చంద్రహాస్‌తో సినిమా చేయాలని ముందుకొచ్చాడు. చంద్రహాస్ దర్శకుల హీరో. సినిమాకు నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది”అని అన్నారు. నిర్మాత మళయజ ప్రభాకర్ మాట్లాడుతూ “రామ్ నగర్ బన్నీ సినిమా ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. మీ ఇంట్లో ఒకరు సినిమా చూశాక నచ్చితే మిగతా అందరూ చూడండి. ఒక అమ్మగా చెబుతున్నా. అందరూ మూవీని ఎంజాయ్ చేస్తారు”అని పేర్కొన్నారు. హీరో చంద్రహాస్ మాట్లాడుతూ “రామ్ నగర్ బన్నీ సినిమా టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. నాకు ఇంత మంచి మూవీ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ శ్రీనివాస్‌కి థ్యాంక్స్. రామ్ నగర్ బన్నీ సినిమా పూర్తి ఎంటర్ టైనర్‌”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, హీరోయిన్లు విస్మయ శ్రీ, రిచా జోషి , అంబికా వాణి, మధునందన్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News