Tuesday, December 10, 2024

రణబీర్, సాయిపల్లవి ‘రామాయణ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయిపల్లవి కాంబినేషన్ లో రామాయణ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.అయితే, ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో మూవీ సెట్స్ నుంచి రణ్ బీర్, సాయిపల్లవి ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇందులో రణ్ బీర్ రాముడి గెటప్, సాయిపల్లవి సీతా గెటప్ లో కనిపించారు.

తాజాగా ఈ సిినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. నితీశ్ తివారి దర్శకత్వంలో ఈ మూవీని రెండు పార్టులుగా రూపొందిస్తున్నారు. మొదటి పార్ట్ ను 2026 దీపావళికి కానుకగా, రెండో పార్ట్ ను 2027 దీపావళికి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News