Saturday, October 5, 2024

మణికొండలో వినాయకుడి మండపంలో డ్యాన్స్… గుండెపోటుతో సాఫ్ట్ వేర్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మణికొండలోని అల్కాపూరి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అల్కాపూరి టౌన్ షిఫ్ లోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ మృతి చెందాడు. రూ.15 లక్షల వరకు లడ్డు వేలం‌ పాటలో శ్యామ్ పాడారు. లడ్డు వేలం తరువాత గణనాథుడి నిమజ్జన కార్యక్రమంలో తీన్ మార్ స్టెప్పులు కూడా వేశాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ శ్యామ్ ప్రసాద్ ఇంటికి వెళ్లిన తరువాత గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అల్కాపూరి కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News