Tuesday, October 15, 2024

రంగారెడ్డి కలెక్టరేట్ భవనంలో కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో ఎఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన
దూసరి బాలకృష్ణ గౌడ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏ ఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. పస్తుతం బాలకృష్ణ రంగారెడ్డి కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున 03:30 గంటలకు విధుల్లో ఉండగానే  బాత్రూం గదిలోకి వెళ్లి తలుపులు మూసివేసి తన సొంత ఆయుధంతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి ఉద్యోగులు గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు బాలకృష్ణ ఆన్లైన్ గేమ్స్ బానిసగా మారడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News