Tuesday, October 15, 2024

అమెరికాలో హెలెన్ విలయతాండవం… 44 మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో హరికేన్ హెలెన్ విలయతాండవం సృష్టించింది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో హరికేన్ విధ్వంసం సృష్టించడంతో 44 మంది దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల మధ్య జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. యునికోయ్ కౌంటీ ఆస్పత్రిని వరదలు ముంచెత్తడంతో రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో 54 మందిని రక్షించారు. అట్లాంటాలో 28.24 సెంటీ మీటర్ల వర్ష పాతం కురవడంతో 1886లో నమోదైన 24.36 సెంటీ మీటర్ల రికార్డును బద్దలు కొట్టినట్లు అధికారులు వెల్లడించారు. హరికేన్ కారణంగా పాఠశాలు, విశ్వవిద్యాలయాలు సెలవులు ప్రకటించాయి. పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సమాచారం. ఫ్లోరిడా తీరం దాటేటప్పుడు 225 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News