Thursday, October 10, 2024

జనగామలో బోల్తాపడిన డిసిఎం: 16 ఆవులు మృతి

- Advertisement -
- Advertisement -

జనగామ: ఆవుల లోడుతో వెళ్తున్న డిసిఎం వ్యాను బోల్తాపడిన సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. వావిలాల శివారులో ఆవుల లోడుతో వెళ్తున్న డిసిఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో 16 ఆవులు మృతి చెందాయి. కొన్ని ఆవుల తీవ్రంగా గాయపడ్డాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు. డిసిఎంను అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News