Saturday, October 5, 2024

‘ఎన్‌బికె 109’ నుంచి దసరా కానుకగా..

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఎక్కువ శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఈ టైటిల్ పోస్టర్ లేదా టీజర్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ సినిమా కథ ఎలా ఉంటుందనేది కూడా ఎవరికి తెలియదు. అయితే ‘ఎన్‌బికె 109’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ లేదంటే టీజర్‌ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.

డైరెక్టర్ బాబీ కూడా దసరాకి మించిన ప్రత్యేక సందర్భం ఉండదని భావించి అప్పుడే టైటిల్ అప్డేట్ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ పవర్‌ఫుల్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ.. బోయపాటి దర్శకత్వంలో చేయనున్న ‘అఖండ 2’ పైన దృష్టిపెట్టనున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో 150 కోట్ల బడ్జెట్ తో ‘అఖండ 2’ ని బోయపాటి తెరకెక్కించబోతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News