Saturday, July 27, 2024

మోడల్‌కు మద్యం తాగించి అత్యాచారం

- Advertisement -
- Advertisement -

rape

 

సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ, ఇద్దరు నిందితుల అరెస్టు

హైదరాబాద్ : మోడల్‌కు మద్యం తాగించి అత్యాచారం చేసి, ఈ ఘటనను వీడియో లో చిత్రీకరించిన ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువతి మోడలింగ్ చేసేందుకు నగరానికి వచ్చి వెంకటగిరిలోని పెద్ద యాదయ్య నిలయంలో ఉంటోంది. గతంలో ఎల్లారెడ్డిగూడలోని ఓ ఉమెన్స్ హాస్టల్‌లో ఉండేది. ఆ సమయంలో హాస్టల్ యజమాని కుమారుడు రిషీ రేవన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు స్నేహంగా ఉంటున్నారు. యువతి గత నాలుగు నెలల క్రితం హాస్టల్ నుంచి బయటికి వచ్చి వెంకటగిరిలోని పెంట్ హౌస్‌లో ఉంటోంది. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన రిషి అలియాస్ రిషీ రేవన్ తన స్నేహితుడు నిఖిల్ రెడ్డితో కలిసి తన ఇంటికి వచ్చాడని, తనకు మద్యం తాగించిన తర్వాత తనపై అత్యాచారం చేశాడని ఆ యువతి ఆరోపించింది.

రిషీ అత్యాచారం చేయగా అతడి స్నేహితుడు నిఖిల్ రెడ్డి సెల్ ఫోన్‌లో వీడియో తీశాడని తెలిపింది. ఇది ఎవరికైన చెబితే చంపేస్తానని బెదిరించారని వెల్లడించింది. ఆ తరువాత వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పేర్కొంది. తనపై అత్యాచారం చేసిన సమయంలో వీడియో తీశానని, వాటిని సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడని బాధిత యువతి వాపోయింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. విచారణలో అసలు విషయాలు బయటపడతాయని పోలీసులు వెల్లడించారు.

Rape on the model
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News