Thursday, June 6, 2024

హత్య చేసి.. యువతిపై సామూహిక అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Minor boy rapes girl in Madannapet

జైపూర్: రోజు రోజుకు కామాంధులు మానవ మృగాలుగా మారుతున్నారు. యువతిని చంపి అనంతరం ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం బుండీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16 ఏళ్ల యువతి మేకలు మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లింది. మేకలు మేపాడానికి వెళ్లిన బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా అటవీ ప్రాంతంలో ఆమె శవంగా కనిపించింది. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం చేస్తుండగా ప్రతిఘటించడంతో యువతిని హత్య చేసి అనంతరం మూడు మానవ మృగాలు సామూహిక అత్యాచారం చేసినట్టు శవ పరీక్షలో తేలింది. మర్మాంగాల్లో 30పైగా గాయాలు ఉన్నట్టు సమాచారం. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News