Friday, September 19, 2025

శుక్రవారం రాశిఫలాలు (19-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – వృత్తి- ఉద్యోగ, వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పు లేవి చోటు చేసుకోవు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు ఊరటను కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

వృషభం – మీ ఆలోచనలకు కార్యాచరణలకు పొంతన ఉండదు, వాయిదాలలో ఉన్న కోర్టు కేసులు మనస్థాపానికి కారణం అవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ చూపుతారు.

మిథునం – గతంలో అమ్మే ఉద్దేశంతో కొన్న స్థలాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టాలన్న ఆలోచనలు కలుగుతాయి. ఈ విషయమై కుటుంబ సభ్యులతో సమావేశం సాగిస్తారు..

కర్కాటకం – కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలను సూచనలు పాటించండి.  మీ హోదాను పెంచే విధంగా సంతానం అభివృద్ధి పథంలో పయనిస్తారు.

సింహం – మెరుగైన జీవితాన్ని సాగించడానికి అభివృద్ధి మార్గాలను అన్వేషిస్తారు. పాత మిత్రులతో కలిసి చిన్నపాటి విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి.

కన్య –  ఎదుటి వారికి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి గానూ మీ సాయ శక్తులు ప్రయత్నిస్తారు.  సత్ఫలితాలను సాధిస్తారు. మీ మిత్రవర్గంలోనే ఒకరితో అభిప్రాయ బేధాలు చోటు చేసుకుంటాయి.

తుల – సంతకాలు అగ్రిమెంట్లు ఆర్థికపరమైన లావాదేవీల విషయాలలో ఆలోచించి నిదానంగా నింపాదిగా వ్యవహరించండి. మీ సలహాలు సూచనలు కోరుతూ ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు.

వృశ్చికం – ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఒకానొక విషయంలో తెగించి మొండి ధైర్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

ధనుస్సు – ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తారు ఇందుకుగాను ధనాన్ని కూడా అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

మకరం – అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత ఉద్యోగ అవకాశాల పైన దృష్టి సారిస్తారు.

కుంభం – ప్రతి అడుగును భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వేస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.

మీనం – ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెండింగ్లో ఉన్న బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం మంచిది.

Weekly rasi phalalu next week

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News